India: ఏసీ రైళ్లలో కన్నా విమాన ప్రయాణానికే మొగ్గు.. కేంద్రం నివేదికలో వెల్లడి!

  • ప్రయాణికుల రద్దీ 20 శాతం పెరిగింది
  • మరో 20 ఏళ్లలో 100 కోట్లకు వృద్ధి
  • ప్రగతిపై నివేదిక విడుదల

ఇండియాలో ఏసీ రైళ్లలో ప్రయాణిస్తున్న వారి సంఖ్యతో పోలిస్తే విమానాల్లో ప్రయాణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్రం ఓ రిపోర్టును విడుదల చేయగా, అందులో ఈ విషయం వెల్లడైంది.

ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద పౌర విమానయాన మార్కెట్ గా ఇండియా అభివృద్ధి చెందుతోందని స్పష్టం చేసిన ఈ రిపోర్టు, ఏసీ కోచ్ ప్రయాణికుల సంఖ్యను విమాన ప్రయాణికుల సంఖ్య దాటేసిందని తెలిపింది. గడచిన మూడు సంవత్సరాల్లో పలు కొత్త విమానాశ్రయాలు అందుబాటులోకి రావడం, విమాన సర్వీసుల సంఖ్య పెరగడంతోపాటు ప్రయాణికుల రద్దీ 20 శాతం మేరకు పెరిగిందని తెలిపింది. మరో 20 సంవత్సరాల్లో వార్షిక విమాన ప్రయాణికుల సంఖ్యను వంద కోట్లకు (ప్రస్తుత సంఖ్య 20 కోట్లు కాగా, 5 రెట్ల వృద్ధి) పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు కేంద్రం నివేదిక వెల్లడించింది.

  • Loading...

More Telugu News