Katrina Kaif: కత్రినా కైఫ్ నిర్వహిస్తున్న జిమ్ లో శ్రీదేవి కుమార్తె సందడి!

  • కత్రినా జిమ్ లో జాన్వీ కపూర్ వ్యాయామం 
  • కాసేపు రిసెప్షనిస్టు చైర్ లో కూర్చున్న జాన్వీ
  • ఫొటో తీసి షేర్ చేసిన కత్రినా
కత్రినా కైఫ్ నిర్వహిస్తున్న జిమ్ లో రిసెప్షనిస్టుగా శ్రీదేవి కుమార్తె పని చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఈ ఫొటో చూస్తే అవుననాల్సిందే. శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్, ఇలా కత్రినా కైఫ్ జిమ్ లోని రిసెప్షన్ లో కూర్చుని అచ్చం రిసెప్షనిస్టుగా ఫోన్ లో మాట్లాడుతుంటే, కత్రినా ఫొటో తీసింది.

తర్వాత దానిని తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ, "మా జిమ్‌కు అందమైన కొత్త రిసెప్షనిస్ట్‌ వచ్చింది" అంటూ క్యాప్షన్ పెట్టగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. జాన్వీ నిత్యమూ ఆ జిమ్ లోనే వ్యాయామం చేస్తుందట. కాగా, జాన్వీని బాలీవుడ్ కు పరిచయం చేస్తూ తీసిన 'దఢక్' జూలై 20న విడుదల కానుంది.
Katrina Kaif
Janvi Kapoor
Jim
Excersise
Receptionist

More Telugu News