TSRTC: నెత్తురోడిన కరీంనగర్ రహదారి... ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని ఆరుగురి దుర్మరణం!

  • మరో 15 మందికి తీవ్ర గాయాలు
  • బస్సులో చిక్కుకున్న పలువురు ప్రయాణికులు
  • సహాయక చర్యలు ముమ్మరం
మూడు రోజుల క్రితం టీఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ చేసిన తప్పిదం కారణంగా, నాలుగు వాహనాలు ఢీకొన్న ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను మరువకముందే మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చంజర్ల దగ్గర ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొనగా, ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.

ఈ దుర్ఘటనలో మరో 15 మందికి తీవ్ర గాయాలుకాగా, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బస్సులోనే పలువురు ప్రయాణికులు చిక్కుకోవడంతో, వారిని వెలికి తీసేందుకు ఇతర వాహనాల ప్రయాణికులు, స్థానికులు శ్రమిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చిన తరువాత సహాయక చర్యలు వేగవంతం అయ్యాయి.
TSRTC
Road Accident
Bus
Lorry

More Telugu News