India: ఇకపై వెయిటింగ్ లిస్టు టికెట్ కన్ఫర్మ్ అయ్యే చాన్స్ తెలపనున్న రైల్వేశాఖ!

  • ఎప్పటికప్పుడు విషయాన్ని చెప్పే ఐఆర్సీటీసీ
  • సోమవారం అర్ధరాత్రి నుంచి కొత్త సేవలు ప్రారంభం
  • రైళ్ల ఆలస్యానికి కారణాలను వీడియో రూపంలో వెల్లడించాలని నిర్ణయం

నిత్యమూ కోట్లాది మంది ప్రయాణించే రైళ్లలో వెయిటింగ్ లిస్టు జాబితా చాంతాడంత ఉంటుందన్న సంగతి విదితమే. టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదోనన్న టెన్షన్ ప్రయాణికులను కలవర పెడుతుంది. అయితే, అందుబాటులోకి వచ్చిన అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకున్న ఆన్ లైన్ రైల్వే టికెటింగ్ సేవల సంస్థ ఐఆర్సీటీసీ, ఇకపై బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎంత ఉన్నాయన్న విషయాన్ని ఎప్పటికప్పుడు చెబుతుంటుంది.

 ఈ సేవలు సోమవారం అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి వచ్చాయి. తనకు బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయన్న విషయాన్ని, పీఎన్ఆర్ నంబర్ ఆధారంగా వెబ్ సైట్ వెల్లడిస్తుంది. రోజుకు దాదాపు 13 లక్షల టికెట్లు ఆన్ లైన్లో అమ్ముడుపోతున్నాయి. కాగా, రైళ్ల ఆలస్యానికి గల కారణాలను అన్ని ప్రధాన స్టేషన్లలోని ప్లాట్ ఫాంపై వీడియో రూపంలో ప్రదర్శిస్తుండాలని కూడా రైల్వే శాఖ నిర్ణయించింది.

More Telugu News