Pawan Kalyan: నేనెవరో తెలీదంటారా? పెద్దరికాన్ని నిలబెట్టుకోండి: పవన్ కల్యాణ్

  • గతంలో పవన్ కల్యాణ్ ఎవరో తెలియదన్న అశోక్ గజపతిరాజు
  • ప్లెక్సీలో ఆయన బొమ్మ కనిపించడంతో గుర్తు చేసుకున్న పవన్
  • హోదా గురించి అడిగితే నేనెవరో తెలియదంటున్నారని విమర్శలు
తాను ఎవరో తెలియదని వ్యాఖ్యానించిన కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. బస్సుయాత్రలో భాగంగా రాజాం చేరుకున్న తరువాత, అక్కడ ప్రసంగిస్తున్న వేళ, సీఎం చంద్రబాబునాయుడు ధర్మపోరాట దీక్ష ఫ్లెక్సీని, అందులో కనిపిస్తున్న అశోక్ జగపతిరాజు ఫొటోను చూసి విమర్శలు గుప్పించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను విజయనగరం వెళ్లి, అశోక్ గజపతిరాజు కోసం ప్రచారం చేశానని, ఆయనకు ఓట్లు వేయాలని ప్రజలను కోరానని, ఇప్పుడు హోదా గురించి అడిగే సరికి, నేను ఎవరో తెలియదని ఆయన అంటున్నారని నిప్పులు చెరిగారు. ఆయన వయసులో తనకన్నా పెద్దవారని, ఆయన పెద్దరికాన్ని తాను గౌరవిస్తున్నానని, ఆయనే దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పారు. అభివృద్ధి పనులంటే ఒక్క అమరావతిని మాత్రమే చూస్తే సరిపోదని హితవు పలికారు. రాష్ట్రాభివృద్ధి కేవలం అవినీతిలో మాత్రమే కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
Pawan Kalyan
Ashokagajapati raju
Srikakulam District
Rajam

More Telugu News