mamatha benerjee: కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మమత బెనర్జీ!

  • రోజు రోజుకి పెరుగుతున్న ఇంధన ధరలు
  • సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం
  • పెరుగుతున్న ధరలపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి మమత డిమాండ్
పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు తగ్గించే విషయంలో కేంద్ర ప్ర‌భుత్వ వ్య‌వ‌హార శైలి సరిగా లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. రోజు రోజుకి పెరుగుతున్న ఇంధన ధరలు వ్యవసాయం, రవాణా, సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు.

ఇలాంటి భయంకరమైన పరిస్థితి నుండి బయట పడటానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు పరిష్కార మార్గాన్ని కనుగొనలేకపోతోందని ప్రశ్నించారు. తక్షణమే పెరుగుతున్న ధరలపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తన ట్వీట్ లో ముఖ్యమంత్రి మమత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
mamatha benerjee
West Bengal

More Telugu News