vijay devarakonda: హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోన్న విజయ్ దేవరకొండ తమ్ముడు

  • హీరోగా సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ 
  • చకచకా జరిగిపోతోన్న సన్నాహాలు
  • రంగంలోకి ఆనంద్ దేవరకొండ      
హీరోల సోదరులు .. హీరోయిన్స్ చెల్లెళ్లు తెరకి పరిచయం అవుతుండటమనేది చాలాకాలం నుంచి వున్నదే. హీరోయిన్స్ చెల్లెళ్లు .. హీరోల సోదరులుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయినవారిని వ్రేళ్ల పైన లెక్క పెట్టొచ్చు. అయినా అలాంటి ప్రయత్నాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే వస్తున్నాయి. అలా సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

అదే విధంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా సిద్ధమవుతున్నాడట. ఇప్పటికే ఆనంద్ దేవరకొండ ఒక వైపున నటనలోను .. ఫిట్ నెస్ విషయంలోను శిక్షణ తీసుకుంటున్నాడట. ప్రముఖ నిర్మాణ సంస్థ ఒకటి ఆనంద్ దేవరకొండను హీరోగా పరిచయం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సమాచారం. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.    
vijay devarakonda
anand devarakonda

More Telugu News