raviteja: 'నేల టిక్కెట్టు' తొలిరోజు వసూళ్లు

  • రవితేజ హీరోగా తెరకెక్కిన 'నేల టిక్కెట్టు'
  • కథానాయికగా మాళవిక శర్మ  
  • కల్యాణ్ కృష్ణకి దక్కని హ్యాట్రిక్ హిట్     

రవితేజ హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'నేల టిక్కెట్' సినిమా తెరకెక్కింది. మాళవిక శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాను భారీస్థాయిలో రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలిరోజున 3.9 కోట్ల షేర్ ను రాబట్టింది. గతంలో కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన 'సోగ్గాడే చిన్నినాయనా' .. ' రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి.

 దాంతో సహజంగానే ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఇక రవితేజ మార్క్ సినిమాలను ఇష్టపడేవారు కూడా థియేటర్ల దగ్గర సందడి చేస్తున్నారు. అయితే ఈ సినిమాతో తనకి హ్యాట్రిక్ హిట్ పడుతుందని భావించిన కల్యాణ్ కృష్ణకి నిరాశ ఎదురైనట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి రెండు సినిమాల స్థాయిలో ఈ సినిమాను ఆయన అందించలేకపోయాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. రవితేజ క్రేజ్ ఎంతవరకూ నడిపిస్తుందో చూడాలిమరి.     

More Telugu News