ntr: సినిమా కబుర్లు .. సంక్షిప్త సమాచారం

  • 'మహానటి' హిట్ పట్ల షాలినీ పాండే ఆనందం
  • 'అజ్ఞాతవాసి' వారికే 'అరవింద సమేత' ఓవర్సీస్ హక్కులు
  • హైదరాబాద్ లో 'అభిమన్యుడు' సెలబ్రిటీ షో    

*  'మహానటి' సినిమాలో సావిత్రి స్నేహితురాలు సుశీల పాత్రను షాలినీ పాండే పోషించింది. ఈ సినిమాకి లభిస్తోన్న ఆదరణను గురించి తాజాగా ఆమె స్పందించింది. ఈ పాత్ర దక్కడం తన అదృష్టమనీ .. ఈ పాత్రలో చాలా బాగా చేశావంటూ అంతా మెచ్చుకుంటూ వుంటే చాలా ఆనందంగా ఉందని ఆమె అంది.
*  ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా రూపొందుతోంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. 'అజ్ఞాతవాసి' సినిమా ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్న ఎల్.ఎ. సంస్థ వారే .. 'అరవింద సమేత వీర రాఘవ' ఓవర్సీస్ హక్కులను కూడా సొంతం చేసుకున్నట్టుగా చెబుతున్నారు.
*  విశాల్ హీరోగా తమిళనాట విడుదలైన 'ఇరుంబు తిరై' అక్కడ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో ఈ సినిమాను 'అభిమన్యుడు' పేరుతో జూన్ 1వ తేదీన భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందుగా చిత్ర పరిశ్రమలోని ప్రముఖుల కోసం హైదరాబాద్ లో సెలబ్రిటీ షో వేయడానికి విశాల్ సన్నాహాలు చేస్తున్నాడు.   

  • Loading...

More Telugu News