ఉద్ధవ్ ఠాక్రే కంటే నాకే ఎక్కువ సభ్యతాసంస్కారాలు ఉన్నాయి: యూపీ సీఎం యోగి
- చెప్పులు విప్పకుండానే శివాజీ విగ్రహానికి పూలదండేసిన యోగి
- అదే చెప్పుతో యోగి చెంపపై కొట్టాలన్న శివసేన అధినేత ఉద్ధవ్
- ఉద్ధవ్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్న యోగి
యోగి చేసిన పనికి అదే చెప్పుతో ఆయన చెంప పగలగొట్టాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అంతే ఘాటుగా యోగి స్పందించారు. ఉద్ధవ్ ఠాక్రేకు వాస్తవం ఏంటో తెలియదని, ఆయన నుంచి సభ్యతాసంస్కారాలు నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదని బదులిచ్చారు. మహనీయులకు, గొప్ప వ్యక్తులకు ఎలా నివాళులర్పించాలో తనకు తెలుసని, ఉద్ధవ్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.