Karnataka: శాండల్ వుడ్ హీరోయిన్ గిప్ట్ ని కొట్టేసిన క్యాబ్ డ్రైవర్!

  • హీరోయిన్ పరుల్ యాదవ్ కు చేదు అనుభవం
  • ఓ వివాహా వార్షికోత్సవానికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్న నటి
  • ఏదో పని నిమిత్తం మార్గమధ్యంలో కారు దిగిన పరుల్
  • తిరిగి కారెక్కేసరికి ఓ గిఫ్ట్ మాయం 

శాండల్ వుడ్ హీరోయిన్ పరుల్ యాదవ్ కు చేదు అనుభవం ఎదురైంది. ఓ వివాహ వార్షికోత్సవానికి వెళ్లే నిమిత్తం పరుల్ యాదవ్ కొనుగోలు చేసిన ఖరీదైన బహుమతులను క్యాబ్ డ్రైవర్ కొట్టేశాడు. కాబోయే దంపతులకు గిఫ్ట్ గా ఇచ్చేందుకు ఖరీదైన రెండు వాచ్ లను పరుల్ యాదవ్ కొనుగోలు చేసింది. వాటిలో ఒకటి మాయమవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసుల కథనం ప్రకారం, ఓ వివాహ వార్షికోత్సవానికి హాజరయ్యే నిమిత్తం పరుల్ యాదవ్ ఓ క్యాబ్ బుక్ చేసుకుంది. మార్గమధ్యంలో ఆమెకు ఏదో పని ఉండటంతో కారు దిగింది. తిరిగి కారులో కూర్చున్న ఆమెకు ఒక గిఫ్ట్ బాక్స్ కనపడలేదు. దీంతో, క్యాబ్ డ్రైవర్ ని నిలదీయగా తనకేమీ తెలియదని చెప్పి వెళ్లిపోయాడు. ఈ మేరకు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. సదరు క్యాబ్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని ఖరీదైన వాచ్ ను స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News