Mahanadu: రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై చంద్రబాబు.. మహానాడుకు వినూత్నంగా తరలిన సీఎం!

  • ప్రతినిధుల నమోదుతో మొదలైన మహానాడు
  • భారీ బైక్ ర్యాలీతో సభా ప్రాంగణానికి చంద్రబాబు
  • రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ఎక్కిన ఏపీ సీఎం
విజయవాడలో తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రతినిధుల సమోదుతో ప్రారంభమైంది. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు తన నివాసం నుంచి సీఎం చంద్రబాబునాయుడు వినూత్న రీతిలో బయలుదేరారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య మోటార్ సైకిల్ ఎక్కిన చంద్రబాబు, భారీ ర్యాలీగా మహానాడు ప్రాంగణానికి బయలుదేరారు. రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను చంద్రబాబు నడపడం గమనార్హం. ర్యాలీలో ఇవే తరహా బైకులు అధికంగా కనిపిస్తున్నాయి. ర్యాలీలో టీడీపీ నేతలు బోండా ఉమా మహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. వీరిని అనుసరిస్తూ, వందలాది మంది టీడీపీ కార్యకర్తలు మహానాడు స్థలికి తరలివెళ్లారు.
Mahanadu
Telugudesam
Chandrababu
Vijayawada
Bike Rally

More Telugu News