Separatist: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో సంచలనం.. కశ్మీర్లో టాపర్‌గా వేర్పాటువాద నేత కుమార్తె!

  • 97.8 శాతం మార్కులు సాధించిన సామా షబీర్
  • తీహార్ జైలులో ఉన్న సామా తండ్రి షబీర్ షా
  • రాష్ట్ర యువతకు సామా ఆదర్శం కావాలన్న సీఎం

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో కశ్మీర్ వేర్పాటువాద నేత షబీర్ షా కుమార్తె సామా షబీర్ షా కశ్మీర్ రాష్ట్రంలో టాపర్‌గా నిలిచింది. శ్రీనగర్‌లోని అత్వాజన్‌లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని అయిన సామా శనివారం ప్రకటించిన ఫలితాల్లో 97.8 శాతం మార్కులు సాధించి టాపర్‌గా నిలిచినట్టు స్కూలు అధికారి ఒకరు తెలిపారు.
కశ్మీర్ డెమొక్రటిక్ ఫ్రీడం పార్టీ (జేకేడీఎఫ్‌పీ) చీఫ్ అయిన షబీర్ షా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. కశ్మీర్ లోయలో అల్లర్లు రేకెత్తించేందుకు షబీర్ షా నిధులు సమకూర్చారన్న అభియోగాలపై గత సెప్టెంబరులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాను అరెస్ట్ చేసింది.

12వ తరగతి ఫలితాల్లో టాపర్‌గా నిలిచిన సామా షబీర్‌ను జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అభినందించారు. రాష్ట్రంలోని యువతకు ఆమె విజయం స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు.

More Telugu News