చంద్రుడిపై నడిచిన నాలుగో వ్యక్తి అలన్ బీన్ ఇక లేరు!
- తీవ్ర అనారోగ్యంతో రెండు వారాల క్రితం ఆసుపత్రికి
- ప్రశాంతంగా కన్నుమూసినట్టు చెప్పిన కుటుంబ సభ్యులు
- సంతాపం తెలిపిన నాసా
బీన్ మృతికి నాసా సంతాపం తెలిపింది. వ్యోమగామి మైక్ మాసిమినో మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు కలిసిన వాళ్లలో బీన్ ఒక అసాధారణ వ్యక్తి అని కొనియాడారు. నాసా నుంచి బీన్ రిటైరయ్యాక తనకెంతో ఇష్టమైన పెయింటింగ్‌లు వేస్తూ శేష జీవితాన్ని గడిపారు.