mahanati: సినిమాలు చూసే తీరిక కూడా చంద్రబాబుకు ఉండదు: నన్నపనేని రాజకుమారి

  • 'బాహుబలి' గురించి చంద్రబాబు మాట్లాడినప్పుడు అదో క్రేజ్ అయింది
  • పార్టీ, కేబినెట్ మీటింగ్ లో తాజాగా 'మహానటి' గురించి మాట్లాడారు
  • ఈ సినిమాలో సందేశం, ఆదర్శం, నీతి ఉన్నాయి
నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం తపించే ముఖ్యమంత్రి చంద్రబాబుకు సినిమా చూసేంత తీరిక కూడా ఉండదని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. ఇంతకు ముందు 'బాహుబలి' సినిమా గురించి ఆయన మాట్లాడినప్పుడు అదో క్రేజ్ అయిందని చెప్పారు. ఈ మధ్య కాలంలో పార్టీ మీటింగ్ లో, కేబినెట్ మీటింగ్ లో 'మహానటి' సినిమా గురించి ఆయన మాట్లాడారని... దీంతో, ఆ సినిమాను చూడనివాళ్లు కూడా థియేటర్లకు వెళ్లి సినిమా చూసిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. 'మహానటి' సినిమా యూనిట్ ఈరోజు చంద్రబాబును కలిసింది. ఈ సందర్భంగా వారిని ముఖ్యమంత్రి సన్మానించారు.

ఈ సందర్భంగా నన్నపనేని మాట్లాడుతూ, సావిత్ర మళ్లీ పుట్టడానికి అశ్వనీదత్ కుమార్తె, అల్లుడే కారణమని చెప్పారు. ఈ సినిమాలో సందేశం, నీతి, ఆదర్శం, మహిళ స్ఫూర్తి ఉన్నాయని తెలిపారు.
mahanati
Chandrababu
nannapaneni rajakumari
unit
falicitation

More Telugu News