kalyan dev: 'విజేత' ఫస్టులుక్ తో ఆకట్టుకుంటోన్న చిరూ చిన్నల్లుడు

  • కల్యాణ్ దేవ్ హీరోగా 'విజేత'
  • కథానాయికగా మాళవిక నాయర్ 
  • జూలైలో ప్రేక్షకుల ముందుకు

చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి, రీసెంట్ గా 'విజేత' అనే టైటిల్ ను ఖరారు చేసి టైటిల్ పోస్టర్ ను వదిలారు. ఈ కాన్సెప్ట్ పోస్టర్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు.

కల్యాణ్ దేవ్ సింపుల్ లుక్ తో ఈ పోస్టర్ ను వదిలారు. అతనికి అవతల వైపున మురళీ శర్మ కనిపిస్తున్నాడు. కథలో కల్యాణ్ కి ఆయన తండ్రి పాత్రను పోషిస్తూ ఉండవచ్చనీ .. ఇది తండ్రీ కొడుకుల అనుబంధానికి ప్రాధాన్యతనిచ్చే కథ కావొచ్చని అనిపిస్తోంది. ఈ సినిమాలో కల్యాణ్ దేవ్ జోడీగా మాళవిక నాయర్ కనిపించనుంది. సాయి కొర్రపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాను జూలైలో విడుదల చేయనున్నారు. మొదటి సినిమాతో మెగా అల్లుడు ఎన్ని మార్కులు కొట్టేస్తాడో చూడాలి మరి.     

More Telugu News