cbse: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. అమ్మాయిలే టాపర్లు!

  • అబ్బాయిలకన్నా ఎక్కువ ఉత్తీర్ణత సాధించిన అమ్మాయిలు
  • టాప్ రెండు ర్యాంకులు ఉత్తరప్రదేశ్ కే
  • 500 మార్కులకు గాను 499 సాధించిన టాపర్

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో అబ్బాయిలకన్నా అమ్మాయిలే మెరుగైన ఫలితాలు సాధించారు. ఓవరాల్ గా 88.31శాతం మంది అమ్మాయిలు ఉత్తీర్ణత సాధించగా... 78.99శాతం మంది అబ్బాయిలు మాత్రమే పాస్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన మేఘన శ్రీవాస్తవ అనే అమ్మాయి టాపర్ గా నిలిచింది. 500 మార్కులకు గాను ఆమె 499 మార్కులు (99.8శాతం) సాధించింది. ఉత్తరప్రదేశ్ కే చెందిన అనౌష్క చంద్ర అనే మరో అమ్మాయి 498 మార్కులతో రెండో ర్యాంకును కైవసం చేసుకుంది. మొదటి మూడు ర్యాంకులను తొమ్మిది మంది విద్యార్థులు కైవసం చేసుకున్నారు.

ఈ ఉదయం సీబీఎస్ఈ ఫలితాలు వెల్లడయ్యాయి.  cbseresults.nic.in, cbse.nic.in, results.nic.in సైట్ల ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. రోల్ నంబర్, స్కూల్ నంబర్, సెంటర్ నంబర్లను టైప్ చేయడం ద్వారా మార్కుల వివరాలు తెలుసుకోవచ్చు. 

More Telugu News