kanna lakshminaraya: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన కన్నా.. గుంటూరులో ఎన్డీయే నాలుగేళ్ల విజయోత్సవ సభ

  • ఎన్డీయే విజయోత్సవ సభలో బాధ్యతల స్వీకరణ
  • హాజరైన పలువురు నేతలు
  • బీజేపీని బలోపేతం చేస్తామన్న కన్నా
ఏపీ బీజేపీలో కొత్త శకం ప్రారంభమైంది. రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ బాధ్యతలను స్వీకరించారు. గుంటూరులోని సిద్ధార్థ గార్డెన్ లో ఎన్డీయే నాలుగేళ్ల విజయోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా కన్నా పదవీబాధ్యతలను స్వీకరించారు.

ఈ కార్యక్రమానికి బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, ఎంపీ జీవీఎల్ నర్సింహారావు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, పురందేశ్వరి, కృష్ణంరాజు, సోము వీర్రాజు, కంభంపాటి హరిబాబు, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, మాణిక్యాలరావు, విష్ణుకుమార్ రాజు తదితర నేతలు హాజరయ్యారు. అధ్యక్షుడిగా ఎన్నికైన కన్నాను నేతలంతా అభినందించారు. కన్నా మాట్లాడుతూ, ఏపీలో బీజేపీని బలోపేతం చేస్తామని చెప్పారు.
kanna lakshminaraya
bjp
president

More Telugu News