Jagan: కనీస జ్ఞానం కూడా జగన్ కు లేదు.. నాలుగు రోజులకే అలసిపోయిన పవన్ రాష్ట్రాన్ని పాలిస్తారా?: అయ్యన్నపాత్రుడు

  • ఏ వయసు నుంచి పెన్షన్ ఇస్తారో కూడా జగన్ కు తెలియదు
  • కరెంట్ పోతే తనను చంపడానికే అంటూ పవన్ ఆరోపిస్తున్నారు
  • గాలి బ్యాచ్ కు మోదీ టికెట్లు ఎలా ఇచ్చారు?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, వైసీపీ అధినేత జగన్ కు పోలికే లేదని మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఎక్కడ? 16 నెలలు జైల్లో ఉన్న జగన్ ఎక్కడ? అంటూ ఎద్దేవా చేశారు. పెన్షన్ కు అర్థం కూడా జగన్ కు తెలియదని... ఏ వయసు నుంచి పెన్షన్ ఇస్తారనే కనీస జ్ఞానం కూడా ఆయనకు లేదని విమర్శించారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ, ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. జూన్ నుంచి మరో 3.50 లక్షల పెన్షన్లను ఇచ్చేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని అన్నారు.  

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏమాత్రం రాజకీయ పరిపక్వత లేదని అయ్యన్న విమర్శించారు. ఏ మాత్రం అవగాహన లేకుండా ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. పొరపాటున కరెంట్ పోతే తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారంటూ పవన్ ఆరోపిస్తున్నారని... ఆయనకు ఉన్న పరిపక్వత ఏపాటిదో దీంతో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. నాలుగు రోజుల బస్సుయాత్రకే అలసిపోయి విశ్రాంతి తీసుకున్న ఆయన... రాష్ట్రాన్ని నడిపించగలరా? అని ప్రశ్నించారు. విదేశాల్లో నీతులు చెప్పే ప్రధాని మోదీ... కర్ణాటకలో గాలి బ్యాచ్ కు టికెట్లు ఎలా ఇచ్చారని అన్నారు. ఎవరెన్న కుట్రలు పన్నినా ఏపీలో మళ్లీ టీడీపీనే అధికారంలోకి వస్తుందని చెప్పారు.
Jagan
Ayyanna Patrudu
Chandrababu
Pawan Kalyan
Narendra Modi

More Telugu News