Chandrababu: చంద్రబాబు చేసింది ప్రజలంతా చూశారు.. వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతారు: బీజేపీ నేత రామ్ మాధవ్

  • ఎన్టీఆర్ ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారు
  • టీడీపీ-కాంగ్రెస్ ల దోస్తీతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది
  • ఏపీలో బీజేపీ కొత్త ఒరవడిని సృష్టించబోతోంది

కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలతోనే దివంగత ఎన్టీఆర్ ఆనాడు టీడీపీని స్థాపించారని... కానీ, ఆయన ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ విమర్శించారు. టీడీపీ-కాంగ్రెస్ దోస్తీతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో చంద్రబాబు చేతులు కలపడాన్ని ప్రజలంతా గమనించారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.

ఏపీలో వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయని... విజయవాడలో టీడీపీ మహానాడు ఫ్లెక్సీలన్నీ వారసత్వంతో నిండిపోయాయని మండిపడ్డారు. వారసత్వ రాజకీయాలకు ముగింపు పలుకుతామని చెప్పారు. బీజేపీపై టీడీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొడతామని అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంలో ఏపీలో బీజేపీ కొత్త ఒరవడిని సృష్టించబోతోందని చెప్పారు. గుంటూరులో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News