gold: మరింత పెరిగిన బంగారం ధర

  • ఈ రోజు రూ.350 పెరిగిన 10 గ్రా బంగారం ధర
  • రూ.32,475గా పసిడి ధర నమోదు
  • కిలో వెండి ధర రూ.250 పెరిగి రూ.41,550కు చేరిక

బులియన్‌ మార్కెట్‌లో ఈ రోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ.350 పెరిగి రూ.32,475గా నమోదయింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక బంగారం దుకాణదారుల నుంచి డిమాండ్‌ పెరుగుతూ వస్తుండడంతో వరుసగా నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు పై పైకి ఎగుస్తున్నాయి.

మరోవైపు వెండి ధర కూడా ఈ రోజు బంగారం బాటలోనే పయనించింది. కిలో వెండి ధర రూ.250 పెరిగి రూ.41,550 వద్ద ముగిసింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల కొనుగోలుదారుల నుంచి డిమాండ్‌ పెరిగిపోవడంతో వెండి ధర పెరిగిందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇక గ్లోబల్‌ మార్కెట్‌లో బంగారం ధర 0.86 శాతం పెరిగి ఔన్సు 1,304.10 యూఎస్‌ డాలర్లుగా నమోదైంది.      

More Telugu News