floor test: 37 సీట్లు సాధించిన జేడీఎస్‌ ఎలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది?: యడ్యూరప్ప

  • కాంగ్రెస్‌-జేడీఎస్‌లది అపవిత్ర పొత్తు 
  • ప్రజాభీష్టానికి కాంగ్రెస్‌ పార్టీ ద్రోహం
  • సీఎం సీటు కోసం కుమారస్వామి దిగజారుడు రాజకీయాలు

కాంగ్రెస్‌-జేడీఎస్‌లది అపవిత్ర పొత్తని కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్ప అన్నారు. అసెంబ్లీలో కర్ణాటక సీఎం కుమారస్వామి బలపరీక్ష ఎదుర్కుంటోన్న నేపథ్యంలో యడ్యూరప్ప ఉద్వేగభరితంగా మాట్లాడారు. 37 సీట్లు సాధించిన జేడీఎస్‌ ఎలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించారు. ప్రజాభీష్టానికి కాంగ్రెస్‌ పార్టీ ద్రోహం చేసిందని, సీఎం సీటు కోసం కుమారస్వామి దిగజారుడు రాజకీయాలు చేశారని చెప్పుకొచ్చారు. జేడీఎస్‌కి 16 జిల్లాల్లో అసలు సీట్లే దక్కలేదని, గతంలోనూ కుమారస్వామి ఇటువంటి రాజకీయాలే చేశారని, అలాంటి జేడీఎస్‌తో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుందని అన్నారు. రాజ్యాంగ ద్రోహులు మీరా? మేమా? అని ప్రశ్నించారు. 

More Telugu News