redmi 6 phone: త్వరలోనే మార్కెట్లోకి రెడ్ మీ 6 సిరీస్ ఫోన్లు

  • 5.45 అంగుళాల 18:9 నాచ్ డిస్ ప్లే
  • 2జీబీ, 3జీబీ, 4జీబీ ర్యామ్ వెర్షన్లతో మార్కెట్లోకి
  • టెనా వెబ్ సైట్లో దర్శనం

షియోమీ త్వరలోనే రెడ్ మీ 5 సిరీస్ ఫోన్ల స్థానంలో రెడ్ మీ 6 సిరీస్ ఫోన్లను విడుదల చేయనుంది. రెడ్ మీ 6తోపాటు 6ఎ ఫోన్ ను సైతం తీసుకురానుంది. స్మార్ట్ ఫోన్ల విడుదలకు ముందు సర్టిఫై చేసే టెనా వెబ్ సైట్లో ఈ ఫోన్ల వివరాలు కనిపించాయి. రెడ్ మీ 6 ఫోన్ లో ఉండే స్పెసిఫికేషన్ల వివరాలు కొన్ని బయటకు వచ్చాయి.

ఇందులో 5.45 అంగుళాల 18:9 యాస్పెక్ట్ రేషియోతో కూడిన డిస్ ప్లే, 2 గిగాహెర్జ్ ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టమ్, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ముందు భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరా, వెనుక భాగంలో రెండు కెమెరాలు అందులో ఒకటి 12 మెగాపిక్సల్ కెమెరా ఉండనున్నాయి. 2జీ ర్యామ్, 3జీబీ ర్యామ్, 4జీబీ ర్యామ్ వెర్షన్లతో ఇది రానుంది. ఇందులో నాచ్ డిస్ ప్లే ఉంటుంది. అతి త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

More Telugu News