ntr: త్రివిక్రమ్ మూవీ టైటిల్ విషయంలో ఎన్టీఆర్ జోక్యం లేదట!

  • షూటింగు దశలో త్రివిక్రమ్ మూవీ 
  • ఎన్టీఆర్ జోడీగా పూజా హెగ్డే 
  • దసరాకి రిలీజ్ చేసే ఆలోచన      

త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండవ షెడ్యూల్ ను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి 'అరవింద సమేత వీర రాఘవ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. అయితే ఈ విషయంపై ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది.

ముందుగా ఈ సినిమాకి త్రివిక్రమ్ 'అరవింద సమేత .. ' అనే టైటిల్ మాత్రమే పెట్టాడనీ, ఈ టైటిల్ కింద తన పాత్ర పేరైన 'వీరరాఘవ' ఉంచమని ఎన్టీఆర్ పట్టుబట్టాడనేది ఆ వార్త సారాంశం. అలా చేయకపోతే కథానాయిక ప్రాధాన్యత కలిగిన సినిమా అనే మెసేజ్ జనంలోకి వెళుతుందనే అభిప్రాయాన్ని ఎన్టీఆర్ వ్యక్తం చేశాడట.దాంతో 'అరవింద సమేత వీర రాఘవ'గా త్రివిక్రమ్ టైటిల్ మార్చాడని చెప్పుకుంటున్నారు.

అయితే ఇదంతా కేవలం పుకారు మాత్రమేననీ, టైటిల్ విషయంలో ఎన్టీఆర్ జోక్యమే చేసుకోలేదనేది త్రివిక్రమ్ సన్నిహితుల మాట. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.     

More Telugu News