ram charan: చిరంజీవి బాటలోనే అడుగులు వేయబోతున్న రామ్ చరణ్.. ఫౌండేషన్ ఏర్పాటుకు నిర్ణయం!

  • కొత్త ఫౌండేషన్ ను ప్రారంభిస్తున్న చరణ్
  • పారితోషికంలో 15 శాతం ట్రస్ట్ కే కేటాయింపు
  • ఆరోగ్య సమస్యలున్న పేదలకు సేవలు

తన తండ్రి చిరంజీవి బాటలోనే హీరో రామ్ చరణ్ అడుగులు వేయబోతున్నారు. 'చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్'ను స్థాపించిన మెగాస్టార్ పలు సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే తాను కూడా పేదలకు ఉపయోగపడే ఓ ఫౌండేషన్ ను స్థాపించనున్నట్టు చరణ్ తెలిపాడు. తనకు వచ్చే పారితోషికంలో 15 శాతం వరకు ఈ ట్రస్ట్ కు ఇస్తానని చెప్పాడు. తన ఫౌండేషన్ ద్వారా ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి సేవ చేసే అవకాశం ఉంటుందని తెలిపాడు.

గత దశాబ్దకాలంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు సేవ చేస్తున్నామని... తమకు వస్తున్న పారితోషికంలో కొంత మొత్తాన్ని ఆ ట్రస్ట్ కు కేటాయిస్తున్నామని రామ్ చరణ్ చెప్పాడు. ఇప్పటి వరకు ఆ ట్రస్ట్ కు బయటవారి నుంచి ఎలాంటి ఫండ్స్ తీసుకోలేదని తెలిపాడు. తమ సేవలు మరింత ఎక్కువ మందికి చేరాలనే సదుద్దేశంతోనే మరో ఫౌండేషన్ ను స్థాపించబోతున్నట్టు చెప్పాడు. ఈ ఫౌండేషన్ ను అభిమానులకు అంకితం చేస్తామని అన్నాడు. కొత్త ఫౌండేషన్ ను స్థాపించాలనే ఆలోచన తన తండ్రిదేనని చెప్పాడు. 

More Telugu News