Apple: శాంసంగ్ కు రూ. 3,644 కోట్ల ఫైన్ వేసిన అమెరికా కోర్టు!

  • యాపిల్ ఫీచర్లను వాడిన శాంసంగ్
  • పేటెంట్ ఉండటంతో కోర్టుకెక్కిన యాపిల్
  • 533 మిలియన్ డాలర్ల జరిమానా

ఐఫోన్ కు కాపీరైట్ ఉన్న డిజైన్ ఫీచర్లను అనుమతి లేకుండా వాడినందుకు శాంసంగ్ కు 533 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,644 కోట్లు) జరిమానాగా విధిస్తున్నట్టు అమెరికా కోర్టు తీర్పిచ్చింది. అంతకుముందు కోర్టులో జరిగిన వాదనల్లో, ఈ కేసులో తమకు బిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని ఇప్పించాలని యాపిల్ డిమాండ్ చేయగా, శాంసంగ్ 28 మిలియన్ డాలర్లు ఇస్తామని తెలిపింది.

తమ పేటెంట్ల ఫీచర్లను శాంసంగ్ వాడటం వల్ల ఎంతో నష్టం కలిగిందని యాపిల్ చేసిన వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం శాంసంగ్ పై భారీ జరిమానాను విధించింది. ఈ డిజైన్ ఫీచర్లను స్మార్ట్ ఫోన్ లోని కాంపోనెంట్ల మాదిరిగానే వాడామని శాంసంగ్ తరఫున వాదనలు వినిపించిన జాన్ క్విన్ చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఐఫోన్ మోడల్స్ ను తామెంతో శ్రమపడి తయారు చేస్తున్నామని, ఎంతో రీసెర్చ్ తో తయారు చేసే తమ ఫీచర్లను ఇతర కంపెనీలు వాడుకోవడం ద్వారా తమకెంతో నష్టం వస్తోందని యాపిల్ తరపు న్యాయవాది వాదించారు.

More Telugu News