Telangana: నేడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లోకి వంటేరు, మదన్ మోహన్

  • కాంగ్రెస్‌లోకి కొనసాగుతున్న వలసలు
  • గురువారమే ఢిల్లీ వెళ్లిన నేతలు
  • నేడు ఢిల్లీకి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు
తెలంగాణకు చెందిన మరో ఇద్దరు నేతలు నేడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. మెదక్ జిల్లా గజ్వేల్ టీడీపీ ఇన్‌చార్జ్‌గా పనిచేసి ఇటీవల రాజీనామా చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డితోపాటు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు అల్లుడు మదన్ మోహన్ రావు కూడా నేడు (శుక్రవారం) కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇందుకోసం రంగం సిద్ధమైంది. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్న వంటేరు 40 మంది అనుచరులతో గురువారమే ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, సునీతా లక్ష్మారెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు.  
Telangana
Congress
Vanteru pratap reddy
Madan mohan

More Telugu News