koratala: కొరటాల .. చిరూ కాంబినేషన్ కి కారకుడు పవన్ కల్యాణ్!

  • 'భరత్ అనే నేను'తో భారీ హిట్ 
  • పవన్ కి కథ వినిపించిన కొరటాల 
  • అన్నయ్యతో చేయమన్న పవన్    

'భరత్ అనే నేను' అందించిన భారీ విజయం దర్శకుడిగా కొరటాల శివ స్థాయిని మరింత పెంచింది. దాంతో ఆయన తదుపరి ప్రాజెక్టు ఏ హీరోతో ఉండనుంది? అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆయన నెక్స్ట్ మూవీ చిరంజీవితో వుంటుందనే వార్త బయటికి వచ్చింది. 'సైరా' తరువాత చిరంజీవి .. కొరటాలతోనే సెట్స్ పైకి వెళ్లనున్నారనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ ను సెట్ చేసింది పవన్ కల్యాణ్ అనేది తాజా సమాచారం. ఇటీవల పవన్ కల్యాణ్ ను కలిసిన కొరటాల, సందేశంతో కూడిన ఒక కథను ఆయనకి వినిపించాడట. రాజకీయాలతో తాను బిజీగా ఉన్నాననీ, ఈ కథను అన్నయ్యతో చేస్తే బాగుంటుందని ఆయన దగ్గరికి కొరటాలను పవన్ పంపించాడట. ఆ కథను విన్న వెంటనే చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట .. అలా ఈ కాంబినేషన్ సెట్ అయింది. బన్నీతో కొరటాల సినిమా వుండవచ్చని అందరూ అనుకుంటోన్న సమయంలో, ఏకంగా చిరంజీవితోనే కలిసి కొరటాల రంగంలోకి దిగుతుండటం విశేషం.    

More Telugu News