Anupama: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • పారిస్ లో 'తేజ్ ఐ లవ్ యూ' పాటలు
  • అమలాపురం వెళుతున్న నితిన్ 
  • రజనీకాంత్ సరసన సిమ్రన్ 
  • మరో తెలుగు సినిమాలో మాధవన్
 *  సాయి ధరం తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా కరుణాకరన్ రూపొందిస్తున్న 'తేజ్.. ఐ లవ్ యూ ' చిత్రానికి సంబంధించిన రెండు పాటలను ఇటీవల పారిస్ లో చిత్రీకరించారు. దీంతో షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తున్నారు.
*  నితిన్ హీరోగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న 'శ్రీనివాస కల్యాణం' చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ జూన్ ఒకటి నుంచి తిరిగి అమలాపురంలో జరుగుతుంది. ఇరవై రోజుల పాటు జరిగే ఆ షూటింగ్ తో మొత్తం పూర్తవుతుంది. రాశిఖన్నా, నందిత శ్వేత ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
*  సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నిన్నటి తరం నాయిక సిమ్రన్ జతకట్టనుంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ ఓ చిత్రం చేస్తున్న సంగతి విదితమే. ఇందులో రజనీ సరసన ఓ నాయికగా సిమ్రన్ నటించనున్నట్టు సమాచారం.
*  ప్రస్తుతం 'సవ్యసాచి' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న తమిళ నటుడు మాధవన్ తాజాగా మరో తెలుగు చిత్రాన్ని అంగీకరించినట్టు సమాచారం. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించే థ్రిల్లర్ మూవీలో మాధవన్ కీలక పాత్ర పోషిస్తాడట.   
Anupama
Nithin
Rajanikanth
Simran

More Telugu News