Bollywood: ఏమిటీ టైటిల్.. ‘లవ్ రాత్రి’ సినిమాను విడుదల కానీయం!: వీహెచ్ పీ హెచ్చరిక

  • సల్మాన్ ఖాన్ సొంత బ్యానర్ పై రూపొందుతున్న ‘లవ్ రాత్రి’
  • హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ టైటిల్ ఉంది
  • దేశ వ్యాప్తంగా ఈ సినిమా విడుదను అడ్డుకుంటాం 

బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్ బావ ఆయుష్ శర్మను 'లవ్ రాత్రి' చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ సొంత బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో ఆయుష్ శర్మ సరసన వరీనా హుస్సేన్ నటిస్తోంది. కాగా, ఈ చిత్రం టైటిల్ పై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) అభ్యంతరం వ్యక్తం చేసింది.

హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ టైటిల్ ఉందని మండిపడింది. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ‘నవరాత్రి’ని కించపరిచే విధంగా ‘లవ్ రాత్రి’ అనే  టైటిల్ ఉందని, దేశ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించింది. ఈ సందర్భంగా వీహెచ్ పీ ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ మాట్లాడుతూ, హిందువుల పర్వదినం నవరాత్రి నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించడమే కాకుండా టైటిల్ కూడా దారుణంగా పెట్టారని  మండిపడ్డారు.

More Telugu News