Chandrababu: ముఖ్యమంత్రి గారూ.. మీ కిరాయి గూండాలను బట్టలూడదీసి కొడతాం!: పవన్ కల్యాణ్ వార్నింగ్

  • ముఖ్యమంత్రి గారికి చెబుతున్నా..
  • నిన్న రాత్రి పలాసలో నేను బస చేసిన ప్రాంతంలో కరెంట్ తీసేశారు
  • మీ నాయకులు దాడి చేసేందుకు యత్నించారు
  • నేను అన్నింటికీ తెగించిన వ్యక్తిని
తాను అన్నింటికి తెగించిన వ్యక్తినని, తప్పుడు సంకేతాలకు, తప్పుడు వేషాలకు భయపడే వాడిని కాదని ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెబుతున్నానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ‘ముఖ్యమంత్రి గారికి చెబుతున్నాను.. కిరాయి గూండాలని పంపించి నిన్న రాత్రి పలాసలో నేను ఉంటున్న ప్రాంతంలో కరెంట్ తీసేసి దాడి చేసేందుకు ప్రయత్నించారు మీ నాయకులు. నేను అన్నింటికీ తెగించిన వ్యక్తిని . ఇలాంటి తప్పుడు సంకేతాలకి, తప్పుడు వేషాలకి భయపడే వాడు కాదు పవన్ కల్యాణ్.

ముఖ్యమంత్రి గారూ.. మీరు రౌడీలను, గూండాలను పంపితే, మేము సైనికుల స్ఫూర్తితో మీ కిరాయి గూండాలను బట్టలూడదీసి కొడతాం, తరిమి తరిమి కొడతాం. టెక్కలిలో జనసేన కవాతు జరగకుండా లారీలు అడ్డుపెట్టించారు. రాత్రి పలాసలో విద్యుత్ సరఫరా నిలిపివేసి భయపెట్టాలని చూశారు. ఇలాంటి వాటికి భయపడేవారు కాదు జన సైనికులు. కవాతు ఆపిన గుండెల్లో మాటలు అగవు, తూటాలు దిగినా అడుగు ముందుకే, వెనకడుగు వెయ్యదు’ అని పవన్ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు.
Chandrababu
Pawan Kalyan
tekkali

More Telugu News