Cricket: అనూహ్య నిర్ణయం.. దక్షిణాఫ్రికా క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ రిటైర్మెంట్‌ ప్రకటన

  • అన్ని ఫార్మాట్లకి గుడ్‌ బై
  • కెరీర్‌లో 114 టెస్టులు, 228 వన్డేలు ఆడిన డివిలియర్స్‌
  • దక్షిణాఫ్రికా జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న బ్యాట్స్‌మెన్‌
దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకి రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఆయన తన కెరీర్‌లో మొత్తం 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. దక్షిణాఫ్రికా జట్టులోనే కీలక ఆటగాడిగా పేరు సంపాదించాడు.

ప్రస్తుతం ఏబీ డివిలియర్స్‌ ఐపీఎల్ 11వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతోన్న విషయం తెలిసిందే. ప్రపంచ క్రికెట్‌లో ఏబీ డివిలియర్స్‌ బ్యాట్స్‌మన్‌గానే కాక కీపర్‌గా, ఫీల్డర్‌గా కూడా అద్భుతంగా రాణించాడు. ఈ రోజు తాను ఓ కీలక నిర్ణయం తీసుకున్నానని తన ట్విట్టర్‌ ఖాతాలో డివిలియర్స్‌ ఇందుకు సంబంధించి ఓ వీడియో పోస్ట్ చేశాడు.
Cricket
south africa
ab devilliers

More Telugu News