nehru: ఐటీ అధికారులు అడిగిన దానికి వివరణ ఇచ్చాం!: జ్యోతుల నెహ్రూ కుమారుడు

  • మేము ఐటీ రిటర్న్స్‌ వేయలేదు
  • ఓ సేల్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్‌ గురించి అధికారులు వివరణ అడిగారు
  • వివరణ ఇచ్చాము
టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ఇంట్లో ఐటీ శాఖ అధికారులు దాడులు చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆయన కుమారుడు జ్యోతుల నవీన్‌ కుమార్‌ స్పందించారు. తమ ఉమ్మడి ఆస్తి గోదాముల విక్రయానికి సంబంధించి సేల్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్‌ గురించి అధికారులు వివరణ అడిగారని, తాను కాకినాడలోని ఆదాయపన్ను శాఖ అదనపు కార్యాలయానికి వచ్చి వివరణ ఇచ్చానని తెలిపారు. 

అంతేతప్ప తమ నివాసంపై ఎలాంటి ఐటీ దాడులు జరగలేదని అన్నారు. తమది వ్యవసాయ ఆధారిత కుటుంబమని, అందుకే తాము ఐటీ రిటన్స్‌ గురించి పట్టించుకోలేదని అన్నారు. ఐటీ అధికారులకు తాము సమాధానం చెప్పుకున్నామని తెలిపారు.
nehru
Telugudesam
it

More Telugu News