Bandaru Dattatreya: ఆ బాధ నాకు తెలుసు... దత్తన్నను ఇలా కలవాల్సి వస్తుందని అనుకోలేదు: హరికృష్ణ

  • కొడుకు దూరమైతే తండ్రికి ఎంతో బాధ
  • దత్తాత్రేయను పరామర్శించిన హరికృష్ణ
  • నేటి సాయంత్రం సైదాబాద్ లో అంత్యక్రియలు

చేతికి అందివచ్చిన కుమారుడు దూరమైతే, ఓ తండ్రి పడే బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునని నందమూరి హరికృష్ణ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం బండారు దత్తాత్రేయ నివాసానికి వచ్చి, ఆయన్ను పరామర్శించిన హరికృష్ణ మీడియాతో మాట్లాడారు. దత్తాత్రేయ తనకు సన్నిహితుడని, ఆయన ఇంటికి ఇలా రావాల్సి వస్తుందని, కొడుకును పోగొట్టుకున్న ఆయన్ను కలవాల్సి వస్తుందని ఎన్నడూ అనుకోలేదని వ్యాఖ్యానించారు. గత రాత్రి మరణించిన దత్తన్న కుమారుడు వైష్ణవ్ అంత్యక్రియలు, ఈ సాయంత్రం హైదరాబాద్, సైదాబాద్ పరిధిలోని శ్మశాన వాటికలో జరగనున్నాయి. మధ్యాహ్నం నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుందని బండారు కుటుంబీకులు తెలిపారు.

  • Loading...

More Telugu News