nagarjuna: 'ఆఫీసర్' నుంచి ఫస్టు సాంగ్ రిలీజ్

  • వర్మ దర్శకత్వంలో 'ఆఫీసర్'
  • యాక్షన్ .. ఎమోషన్ కి ప్రాధాన్యత 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు  

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా ఆఫీసర్ సినిమా రూపొందింది. యాక్షన్ మూవీగా నిర్మితమైన ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ గా  'నవ్వే నువ్వు' అనే సాంగ్ ను రిలీజ్ చేశారు.

తండ్రీ కూతుళ్ల మధ్య గల ఎమోషన్ దృశ్యాలతో ఈ సాంగ్ కొనసాగుతోంది. ఒక వైపున తండ్రీ కూతుళ్ల మధ్యగల అనుబంధానికి అద్దం పడుతూనే, మరో వైపున వృత్తి పరంగా నాగ్ కి సంబంధించిన యాక్షన్ సీన్స్  ఈ సాంగ్ లో చోటుచేసుకున్నాయి. సిరాశ్రీ రాసిన సాహిత్యానికి రవిశంకర్ అందించిన సంగీతం ఆకట్టుకునేలా వుంది. వర్మ .. నాగ్ కాంబినేషన్లో చాలాకాలం తరువాత వస్తోన్న సినిమా కావడంతో, ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి వుంది.

More Telugu News