HONOR: ఆనర్ నుంచి 7ఏ, 7సీ... భారత మార్కెట్లోకి ఈ రోజు విడుదల

  • ఆనర్ 7ఏ ధర రూ.8,999
  • 7సీలో రెండు వేరియంట్లు
  • 3జీబీ+32జీబీ మోడల్ ధర రూ.9,999
  • 4జీబీ+64జీబీ మోడల్ ధర రూ.11,999
  • ఫ్లిప్ కార్ట్, అమేజాన్ లో విక్రయాలు

చైనాకు చెందిన హువావే ఆనర్ బ్రాండ్ కింద మరో రెండు స్మార్ట్ ఫోన్లను ఈ రోజు దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. యువతను లక్ష్యంగా చేసుకుని బడ్జెట్ ధరల్లో 7ఏ, 7సీ మోడళ్లను తీసుకొచ్చింది. ఆనర్ 7ఏ ధర రూ.8,999. ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే దీని విక్రయాలు జరుగుతాయి. ఆనర్ 7సీలో రెండు వేరియంట్లను విడుదల చేసింది. ఒకటి 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీతో ఉంటుంది. ధర రూ.9,999. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ ధర రూ.11,999. 7సీ విక్రయాలు అమేజాన్ లో మాత్రమే జరుగుతాయి.

ఆనర్ 7ఏ బ్లూ, బ్లాక్, గోల్డ్ రంగుల్లో లభిస్తుంది. 5.7 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, 18:9 యాస్పెక్ట్ రేషియో, ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్, వెనుక డ్యుయల్ కెమెరా 13+2 మెగా పిక్సల్, ఎల్ఈడీ ఫ్లాష్, ముందు భాగంలో సెల్ఫీలకు 8 మెగా పిక్సల్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ లైట్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 8.0 ఓరియోపై పనిచేస్తుంది.

ఆనర్ 7సీ లో 5.99 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, 18:9 యాస్పెక్ట్ రేషియో, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్, ఆనర్ 7ఏలో ఉన్నట్టే వెనుక రెండు కెమెరాలు, ముందు భాగంలో ఒక కెమెరా ఉంటుంది. ఫేస్ అన్ లాక్ ఫీచర్ కూడా ఉంది. ఇది కూడా ఆండ్రాయిడ్ 8.0 ఓరియోపై పనిచేస్తుంది.

More Telugu News