yv subba reddy: మా రాజీనామాలను స్పీకర్‌ ఇంతవరకు ఆమోదించలేదు: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

  • 29న ఢిల్లీ రావాలని స్పీకర్‌ ఆఫీసు నుంచి పిలుపు 
  • ఆ సమావేశానికి హాజరవుతాం
  • రాజీనామాలు ఆమోదించాలని కోరతాం
  • మేము మాత్రమే హోదా కోసం పోరాడుతున్నాం
తమ రాజీనామాలను లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్ ఇంతవరకు ఆమోదించలేదని, తాము ఈ విషయంపై ఈ నెల 6న మరోసారి లేఖ రాశామని వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ రోజు ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ నెల 29న ఢిల్లీ రావాలని తమకు స్పీకర్‌ ఆఫీసు నుంచి పిలుపు వచ్చిందని, తాము ఆ సమావేశానికి హాజరై, రాజీనామాలు ఆమోదించాలని కోరతామని అన్నారు.

ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ తమ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తోందని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. అందుకే తాము తమ పదవులను త్యాగం చేశామని అన్నారు. రాజీనామాలు చేసి తాము కేంద్ర సర్కారుపై ఒత్తిడి తీసుకొస్తున్నామని అన్నారు.                   
yv subba reddy
YSRCP
Andhra Pradesh
Special Category Status

More Telugu News