Telangana: తెలంగాణలో భగ్గుమన్న బీర్ల ధరలు... పెరిగిన ధరల వివరాలివి!

  • ఎండాకాలంలో బీర్లకు డిమాండ్
  • లైట్ బీర్ ధర రూ. 90 నుంచి రూ. 100కు పెంపు
  • స్ట్రాంగ్ బీర్ ధర రూ. 110 నుంచి రూ. 130కి పెంపు
బీర్ల ధరలు భగ్గుమన్నాయి. ఎండాకాలంలో ఎంతో డిమాండుండే బీర్ల ధరలను తెలంగాణ ప్రభుత్వం 10 నుంచి 20 శాతం మేరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం లైట్ బీర్ ప్రారంభ ధర (650 ఎంఎల్) రూ. 90గా ఉండగా, దాన్ని రూ. 100కు పెంచింది. స్ట్రాంగ్ బీర్ ప్రారంభ ధర (650 ఎంఎల్) రూ. 100గా ఉండగా, దాన్ని రూ. 130కి పెంచింది. ఈ మేరకు రాష్ట్ర అబ్కారీ శాఖ ఆదేశాలు విడుదలయ్యాయి. ఈ ఉత్తర్వులు మద్యం దుకాణాలకు చేరకముందే, వార్తను తెలుసుకున్న మద్యం దుకాణాల యాజమాన్యాలు ధరలను పెంచేసినట్టు బోర్డులు పెట్టి అధిక ధరలకు విక్రయాలు ప్రారంభించాయి.
Telangana
Excise
Beer
Summer
Rate Hike

More Telugu News