motkupalli narsimhulu: టీఆర్ఎస్ లో చేరనున్న మోత్కుపల్లి నర్సింహులు?

  • టీడీపీకి గుడ్ బై చెప్పనున్న మోత్కుపల్లి
  • వచ్చే నెలలో టీఆర్ఎస్ తీర్థం
  • ఆలేరు టికెట్ ఆశిస్తున్న సీనియర్ నేత

టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ లో చేరబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. వచ్చే నెలలో కారు ఎక్కేందుకు సన్నాహకాలన్నీ పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరులో తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో ఆయన సమావేశం కాబోతున్నారు. పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఆయన టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉంది.

2019 ఎన్నికల్లో ఆలేరు నియోజకర్గం నుంచి టీఆర్ఎస్ తరపున మోత్కుపల్లి పోటీ చేయనున్నారని చెబుతున్నారు. అయితే తుంగతుర్తి అసెంబ్లీ లేదా వరంగల్ లోక్ సభ నుంచి ఏదో ఒక చోట పోటీ చేయాలని టీఆర్ఎస్ కోరుతున్నట్టు సమాచారం. ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు మోత్కుపల్లిని పలుమార్లు కలిసి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీ బలహీన పడిందని, పార్టీని టీఆర్ఎస్ లో కలపడమే మంచిదని గతంలో మోత్కుపల్లి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News