YSRCP: వైసీపీ ఎంపీలకు లోక్ సభ స్పీకర్ కార్యాలయం నుంచి లేఖ

  • రాజీనామాలపై నిర్ణయం తీసుకోనున్న సుమిత్రా మహాజన్
  • ఈనెల 29న కలవాలంటూ లేఖ
  • ఇటీవలే స్పీకర్ ను కలిసిన వైసీపీ ఎంపీలు
ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ వైసీపీకి చెందిన లోక్ సభ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి రాజీనామాలపై లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ ఎంపీలకు స్పీకర్ కార్యాలయం నుంచి లేఖ అందింది. ఈనెల 29వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య కలవాలంటూ లేఖలో పేర్కొన్నారు. ఇటీవలే తమ రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ ను వైసీపీ ఎంపీలు కోరారు.

దీంతో, జూన్ 1వ తేదీన కలవాలంటూ ఈనెల 19న వీరికి స్పీకర్ కార్యాలయం లేఖ రాసింది. తాజాగా స్వల్ప మార్పులు చేసి, ఈనెల 29న వ్యక్తిగతంగా వచ్చి కలవాలంటూ సూచించింది. ఈ నేపథ్యంలో, ఎంపీల రాజీనామాలపై సుమిత్రా మహాజన్ తుది నిర్ణయం తీసుకోబోతున్నారే విషయం అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 
YSRCP
mp
resignation
sumitra mahajan
letter

More Telugu News