Madala Rangarao: మాదాల ఆరోగ్యం మరింత విషమం... పరామర్శించిన హీరో గోపీచంద్!

  • స్టార్ హాస్పిటల్ లో మాదాలకు చికిత్స
  • డయాలసిస్ జరుగుతోంది
  • వెల్లడించిన వైద్యులు 
ప్రస్తుతం హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్ లో హృద్రోగ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న విప్లవ నటుడు మాదాల రంగారావు ఆరోగ్య పరిస్థితి మరింత విషమం అయినట్టు తెలుస్తోంది. ఈనెల 19వ తేదీ నుంచి ఆయన ఆసుపత్రిలోనే ఉండగా, ఆయన మూత్రపిండాలకు డయాలసిస్ చేస్తున్నామని, గుండె పనితీరు సక్రమంగా లేదని వైద్య వర్గాలు వెల్లడించాయి. డాక్టర్ రమేష్ గూడపాటి పర్యవేక్షణలో ఆయనకు వైద్యం జరుగుతోంది. కాగా, హీరో గోపీచంద్ స్టార్ హాస్పిటల్ కు వచ్చి మాదాల రంగారావును పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
Madala Rangarao
Hyderabad
Star Hospital
Gopichand

More Telugu News