vujay devarakonda: 'టాక్సీవాలా' .. వచ్చే నెలలో వచ్చేస్తున్నాడు

  • సైంటిఫిక్ థ్రిల్లర్ గా 'టాక్సీవాలా'
  • కారులో దెయ్యంతో సాగే కథ 
  • కథానాయికలుగా ప్రియాంక .. మాళవిక శర్మ

విజయ్ దేవరకొండ హీరోగా 'టాక్సీ వాలా' సినిమా రూపొందింది. ఈ సినిమా ద్వారా రాహుల్ సాంకృత్యాన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావలసింది. కానీ కొన్ని కారణాల వలన ఆలస్యమవుతూ వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

 ప్రియాంక జవాల్కర్ .. మాళవిక శర్మ కథానాయికలుగా నటించిన ఈ సినిమాను వచ్చేనెలలో విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చారు. వచ్చేనెల 15వ తేదీన గానీ .. 22వ తేదీన గాని ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. సైంటిఫిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా కొనసాగుతుంది. ఒక టాక్సీ డ్రైవర్ కి .. ఒక దెయ్యానికి మధ్యసాగే కథగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందే ఈ సినిమాతో విజయ్ దేవరకొండకి హిట్ పడటం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.     

  • Loading...

More Telugu News