rashmi: నా అనుమతి లేకుండానే ఫొటో వేస్తారా?: హీరోయిన్ రష్మి ఆగ్రహం

  • ఈవెంట్ కు రష్మి హాజరవుతోందంటూ నాటా ప్రచారం
  • ఆగ్రహం వ్యక్తం చేసిన రష్మి
  • తనను ఎవరూ సంప్రదించలేదని మండిపాటు
ఎప్పుడూ ఆనందంగా, సంతోషంగా ఉండే హీరోయిన్ రష్మికి కోపం వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, అమెరికాలోని తెలుగు సంస్థ 'నాటా' నిర్వాహకులు... తమ ఈవెంట్ కు హీరో ప్రభాస్, డైరెక్టర్ శ్రీను వైట్లతో కలసి రష్మి హాజరవుతోందని ప్రచారం చేసుకున్నారు. దీంతో ఆమె అగ్గిమీద గుగ్గిలం అయింది.

'నా అనుమతి లేకుండానే నా ఫొటో ఎలా వేస్తారు? ఈ ఈవెంట్ గురించి నన్ను ఎవరూ సంప్రదించలేదు. నా అనుమతి లేకుండా నా ఫొటోలను వేయడం ఇదే మొదటి సారి కాదు. ఫొటోలు వేసేముందు అంగీకార పత్రాలను కూడా చెక్ చేయరా?' అంటూ మండిపడింది.
rashmi
nata
event
Prabhas
sreenu vaitla

More Telugu News