sushmitha sen: 15 ఏళ్ల కుర్రాడు నన్ను వేధించాడు: సుస్మితాసేన్

  • అవార్డుల ఫంక్షన్లో ఇది జరిగింది
  • ఎవరూ గుర్తించరు అనుకున్నాడు
  • వెనక నుంచి చేయి పట్టుకున్నా
  • ఫ్యూచర్ పాడు కాకూడదని.. ఎలాంటి చర్య తీసుకోలేదు
ఇటీవల తనకు ఎదురైన లైంగిక వేధింపులను బాలీవుడ్ నటి సుస్మితాసేన్ వెల్లడించింది. ముంబైలో జరిగిన 'మేక్ యార్ సిటీ సేఫ్' కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఘటన గురించి వివరించారు. '6 నెలల క్రితం నాకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఒక అవార్డుల ఫంక్షన్ లో ఓ కుర్రాడు నాతో మిస్ బిహేవ్ చేశాడు. ఆ ప్రదేశమంతా రద్దీగా ఉండటంతో... ఎవరూ గుర్తించరని అతను అనుకున్నాడు.

కానీ, వెనకనుంచి అతని చేతిని నేను పట్టుకున్నా. అతన్ని చూసి నేను షాక్ అయ్యా. ఓ 15 ఏళ్ల వయసు ఉంటుందేమో అతనికి. ఆ తర్వాత అతని మెడను పట్టుకుని పక్కకు లాక్కెళ్లా. నేను గొడవ చేసి, నీ గురించి అందరికీ చెబితే, నీ లైఫ్ ఏమవుతుందో తెలుసా? అని ప్రశ్నించా. దీంతో, అతను సారీ చెప్పాడు. మరోసారి ఇలా చేయనని అన్నాడు. దీంతో, అతని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అతనిపై ఎలాంటి చర్య తీసుకోకుండా వదిలేశా' అని సుస్మిత తెలిపింది. అయితే, ఇలాంటి వాళ్లను వదిలిపెట్టకపోవడమే మంచిదని అభిప్రాయపడింది.
sushmitha sen
sexual abuse
bollywood

More Telugu News