chennampalli kota: చెన్నంపల్లి కోటలో నిధుల కోసం మళ్లీ ప్రారంభమైన తవ్వకాలు

  • ఎనిమిదో ప్రాంతంలో ప్రారంభమైన తవ్వకాలు
  • కోట పైభాగంలోని ప్రవేశ ద్వారం వద్ద ప్రారంభమైన పనులు
  • కృష్ణదేవరాయుల కాలంనాటి నిధులు ఉన్నాయని నమ్ముతున్న స్థానికులు

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో తవ్వకాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. కోట పైభాగంలో ఉన్న ప్రవేశ ద్వారం వద్ద తవ్వకాలు చేపట్టారు. ఇప్పటికే ఏడు చోట్ల తవ్వకాలు జరిపినా, ఇంత వరకు నిధుల ఆచూకీ లభించలేదు. ఇప్పుడు ఎనిమిదో ప్రాంతంలో తవ్వకాలను చేపట్టడంతో... ఉత్కంఠ నెలకొంది.

కోటలో కృష్ణదేవరాయుల కాలంనాటి వజ్రాలు, బంగారం ఉందంటూ ఈ ప్రాంతంలోని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి అధికారులు తీసుకుపోవడంతో... తవ్వకాలకు ప్రభుత్వం అంగీకరించింది. రెవెన్యూ, మైనింగ్ శాఖ, గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మూడు తలల నాగపడగ, ఏనుగు దంతాలు, జంతు కళేబరాల అవశేషాలు, ప్రాచీన కాలంనాటి వస్తువులు మాత్రమే బయటపడ్డాయి. 

More Telugu News