Kamal Haasan: రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోనున్న కమలహాసన్!

  • ఏఎంఎంకే, పీఎంకేలతో పొత్తు పెట్టుకునే అవకాశం
  • రెండు రోజుల క్రితం కమల్ నిర్వహించిన సమావేశానికి హాజరైన నేతలు
  • దినకరన్ పార్టీ పలు జిల్లాల్లో బలపడిందని కమల్ కు సూచిస్తున్న నేతలు

సినీనటుడు కమలహాసన్ స్థాపించిన మక్కల్ నీదిమయ్యం పార్టీ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో దినకరన్ కు చెందిన అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే), పాట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే)లతో పొత్తు పెట్టుకోనున్నట్టు సమాచారం. రెండు రోజుల క్రితం కావేరి నదీ జలాల అంశంపై కమలహాసన్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు.

పీఎంకే తరపున సీనియర్ నేత అన్బుమణి రాందాస్ హాజరు కావడం కమల్ ను ఎంతో సంతోషపెట్టిందని చెబుతున్నారు. దినకరన్ నాయకత్వంలోని ఏఎంఎంకే పార్టీ ఆర్కేనగర్ ఉపఎన్నికలో అన్నాడీఎంకేని మట్టికరిపించిందని... పలు జిల్లాల్లో ఆ పార్టీకి ఓటు బ్యాంకు పెరిగిందని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే బలమైన కూటమిని ఏర్పాటు చేయవచ్చని మక్కల్ నీదిమయ్యం పార్టీ నేతలు కమల్ కు సూచిస్తున్నారట. ఈ సూచనలను కమల్ కూడా సీరియన్ గానే పరిశీలిస్తున్నట్టు సమాచారం. 

More Telugu News