Andhra Pradesh: నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

  • గన్నవరం నుంచి ప్రత్యేకవిమానంలో పుట్టపర్తి వెళ్లనున్న బాబు
  • అక్కడి నుంచి హెలికాఫ్టర్ లో తురకలాపట్నానికి
  • గ్రామంలో చెరువుకు జలహారతి నిర్వహించనున్న సీఎం
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేకవిమానంలో ఆయన బయలుదేరి పుట్టపర్తి చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్ లో పెనుకొండ నియోజకవర్గంలోని రొద్దం మండలం తురకలాపట్నానికి వెళ్లనున్నారు.

ఆ గ్రామంలోని చెరువులో జలహారతి, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం, గ్రామంలోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లకు భూమి పూజ చేస్తారు. ‘రచ్చబండ’ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలతో ముఖాముఖీ మాట్లాడతారు. ఈ సందర్భంగా నిర్వహించే ఓ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు.
Andhra Pradesh
Chandrababu

More Telugu News