Sonia Gandhi: నేడు ఢిల్లీ వెళ్లనున్న జేడీఎస్ నేత కుమారస్వామిగౌడ

  • సోనియా, రాహుల్ తో భేటీ కానున్న కుమారస్వామిగౌడ
  • అగ్రనేతలను తన ప్రమాణస్వీకారానికి ఆహ్వానించనున్న నేత
  • కాంగ్రెస్ నేతలు కూడా నేడు ఢిల్లీకి
  • కర్ణాటకలో మంత్రి పదవుల పంపకంపై చర్చించే అవకాశం
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ లు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామిగౌడ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ నేతల్లో ఎవరికి ఏ పదవులు ఇవ్వాలనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ నేతలు నేడు ఢిల్లీ వెళ్లి సోనియా, రాహుల్ గాంధీలను కలవనున్నారు. ఈ విషయమై వారు చర్చిస్తారని సమాచారం.

మరోపక్క, తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా సోనియా, రాహుల్ గాంధీలను కుమారస్వామిగౌడ ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. కాగా, మంత్రివర్గ కూర్పు విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ నేతృత్వంలోని ప్రతినిధులతో కుమారస్వామి బెంగళూరులో గత రెండు రోజులుగా చర్చలు జరుపుతున్నారు.
Sonia Gandhi
Rahul Gandhi
kumara swamy
siddha ramaiah

More Telugu News