rajanikanth: రజనీకాంత్ గారూ.. మా రిజర్వాయర్లలో నీటిని చూడండి!: జేడీఎస్ నేత కుమారస్వామిగౌడ

  • ప్రస్తుతానికి రజనీకాంత్, నేను ఏ ప్రభుత్వానికి చెందం
  • ఓ సాధారణ పౌరుడిగా రజనీకి నా విజ్ఞప్తి
  • మా రైతులు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకోండి
  • తప్పకుండా మీ మనసు మారుతుంది
కావేరీ జలాల బోర్డు అంశంపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై జేడీఎస్ నేత కుమారస్వామిగౌడ స్పందించారు. బెంగళూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రజనీ చేసిన ఈ వ్యాఖ్యలను తాను స్వీకరించలేనని అన్నారు. ప్రస్తుతానికి రజనీకాంత్, తాను ఏ ప్రభుత్వానికి చెందిన వ్యక్తులం కాదని, ఓ సాధారణ పౌరుడిగా ఆయనకు ఓ విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

రజనీకాంత్ ఓసారి బెంగళూరుకు వచ్చి ఇక్కడి రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వలను పరిశీలించడంతో పాటు తమ రైతులు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకుంటే ఆయన మనసు తప్పకుండా మారుతుందని భావిస్తున్నానని అన్నారు.  
rajanikanth
kumar swamy gowda

More Telugu News