Andhra Pradesh: 2019లో చంద్రబాబే మళ్లీ సీఎం అవుతారు: మంత్రి యనమల

  • ఏపీ అభివృద్ధికి చంద్రబాబు కృషి చేస్తున్నారు
  • ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్నారు
  • చంద్రబాబుపై బీజేపీతో కలిసిన జగన్ కుట్రలు చేస్తున్నారు
2019లో చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి అవడం ఖాయమని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ అభివృద్ధికి చంద్రబాబు నిరంతర కృషి చేస్తున్నారని, ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్నారని ప్రశంసించారు.

చంద్రబాబుపై బీజేపీతో కలిసిన జగన్ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయమై, కర్ణాటకలో అప్రజాస్వామిక చర్యలకు పాల్పడిన బీజేపీ తీరుపై కేంద్రాన్ని జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదని దుయ్యబట్టారు. యూత్ పాలసీలో నిరుద్యోగ భృతిని చంద్రబాబు ప్రకటిస్తారని, త్వరలో కొత్తగా 3.5 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
Andhra Pradesh
yanamala
Chandrababu

More Telugu News